పవన్- త్రివిక్రమ్ సినిమాలో అదే హైలైట్ ...?

Tuesday,September 12,2017 - 11:16 by Z_CLU

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే జరగనున్న యూరప్ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనుంది. అయితే ఈ సినిమాను అత్తారింటికి దారేది స్టైల్ లోనే క్లాస్ స్క్రీన్ ప్లే తో మాస్ ఎలిమెంట్స్ ఆడ్ చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్.

టైటిల్ తో పాటు స్క్రీన్ ప్లే కూడా త్రివిక్రమ్ స్టైల్ స్క్రీన్ ప్లే తో ముందుకు సాగే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడట త్రివిక్రమ్. దాదాపు ఈ సినిమాలో 5 ఫైట్స్ ఉంటాయని.. ఆ యాక్షన్ పార్ట్ థియేటర్స్ లో ఫాన్స్ ను ఖుషి చేసి సినిమాకు హైలైట్ నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం.