నా పేరు సూర్య సినిమాకు పవన్ ప్రచారం

Tuesday,May 08,2018 - 06:10 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ఈ సినిమాకు పవన్ ఎక్స్ క్లూజివ్ గా ప్రమోషన్ కల్పించబోతున్నాడు. ఈనెల 10న జరగనున్న నా పేరు సూర్య సక్సెస్ సంబరాల్లో పవన్ పాల్గొంటాడు.

తన మనసుకు నచ్చే సినిమాల్ని ప్రమోట్ చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధమే. దేశభక్తి ప్రధానంగా వచ్చిన నా పేరు సూర్య లాంటి సినిమాలు సొసైటీకి చాలా అవసరం అని భావిస్తాడు పవన్. అందుకే ఈ సినిమా సక్సెస్ సంబరాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం నా పేరు సూర్య మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. పవన్ రాకతో ఈ మూవీకి మరింత క్రేజ్ వస్తుందని, కలెక్షన్లు ఇంకాస్త పెరుగుతాయని ఎక్స్ పెక్ట్ చేస్తోంది ట్రేడ్. అది నిజం కూడా.