Hot Topic : సైరా దర్శకుడితో పవన్

Thursday,August 13,2020 - 12:43 by Z_CLU

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 29 వ సినిమా (#Pawan29) హాట్ టాపిక్ గా మారింది.  ఇప్పటికే మూడు సినిమాలు ఫైనల్ చేసుకొని వాటిలో రెండు సినిమాలు షూటింగ్ మొదలు పెట్టిన పవన్ తన 28 వ సినిమా వరకూ అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు PSPK29 సినిమాకు సంబంధించి అప్డేట్ బయటికొచ్చింది. Megastar చిరంజీవితో ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో Pawan Kalyan ఓ సినిమా చేస్తాడనేది ఆ అప్డేట్.

ఈ కాంబో సినిమాను SRT Enteratainments బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మించనున్నాడని, సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేస్తారని టాక్. దీంతో ఈ కాంబోపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.

పవన్ ‘VakeelSaab’ బ్యాలెన్స్ షూట్ పూర్తయ్యాక క్రిష్ సినిమాను అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయబోయే సినిమాను పూర్తి చేయాలి. ఆ తర్వాతే ఈ సినిమా చేసే అవకాశం ఉంది. ఈలోపు సురేందర్ రెడ్డి అఖిల్ తో ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతుంది.