Pawan-Bandla - మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్

Monday,September 28,2020 - 02:21 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న పవర్ స్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బండ్ల గణేశ్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని బండ్ల స్వయంగా ఎనౌన్స్ చేశాడు.

“నా కల నిజమైంది.. నా బాస్ మరోసారి ఓకే చెప్పాడు..” అంటూ Bandla Ganesh ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా పవన్ తో దిగిన సెల్ఫీని కూడా పోస్ట్ చేశాడు.

తీన్ మార్ అనే సినిమాతో బండ్ల గణేశ్ కు ప్రొడ్యూసర్ గా అవకాశం ఇచ్చాడు Pawan. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో Gabbar Singh (గబ్బర్ సింగ్) అనే సినిమాను నిర్మించే ఛాన్స్ ఇచ్చాడు. అది బ్లాక్ బస్టర్ హిట్టయింది. గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ పవన్ తో సినిమా చేయాలనుకున్న బండ్ల గణేశ్.. మళ్లీ ఇన్నేళ్లకు అవకాశం అందుకున్నాడు.

ప్రస్తుతం VakeelSaab పనిలో బిజీగా ఉన్నాడు పవన్. ఈ మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత హరీష్ శంకర్ తో మరో మూవీ ఉంది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత బండ్ల గణేశ్ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.