కల్ట్ క్లాసిక్ సినిమాకు 22 ఏళ్లు

Friday,July 24,2020 - 01:56 by Z_CLU

పవన్ కల్యాణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఏంటి..? ఎవరైనా చెప్పే కామన్ ఆన్సర్ తొలిప్రేమ. అవును.. పవర్ స్టార్ గా పవన్ మారడానికి పునాది ఈ సినిమా. టాలీవుడ్ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే, ఈ సినిమాది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇవాళ్టికి తొలిప్రేమ విడుదలై సరిగ్గా 22 ఏళ్లు.

1998, జులై 24న విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. 21 సెంటర్లలో 100 రోజులాడింది. 3 సెంటర్లలో ఏకంగా 200 రోజులాడింది. హైదరాబాద్ లోని సంధ్య 70ఎంఎం థియేటర్ లో ఈ సినిమా 217 రోజులాడింది. గుంటూరు లిబర్టీలో 224 రోజులాడింది. ఇక వరంగల్ రామ్-లక్ష్మణ్ లో అయితే ఏకంగా 300 రోజులాడి రికార్డు సృష్టించింది తొలిప్రేమ.

తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఓ ఎపిక్. ఆ తర్వాత తొలిప్రేమ హీరోయిన్ ఇంట్రడక్షన్ టైపులో చాలా వచ్చాయి కానీ ఏదీ ఈ సినిమాను బీట్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా పాటల్లో మరో గమ్మత్తు ఉంది. ఇందులో ఏ పాటలో ఫిమేల్ వాయిస్ వినిపించదు.

ఈ సినిమాలో ఓ పాట కోసం వేసిన తాజ్ మహల్ సెట్ మరో హైలెట్. ఆ సెట్ ఖర్చును స్వయంగా పవన్ కల్యాణ్ భరించారు. ఆ సెట్ నిర్మాణం కోసం తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు పవన్.

ఈ మూవీలో పవన్ వాడిన బైక్ కు ఆ తర్వాత భారీ డిమాండ్ వచ్చింది. యూత్ అంతా ఆర్ఎక్స్-100 బైకులు ఎగబడి కొన్నారు. అవార్డుల్లో కూడా తొలిప్రేమ సంచలనమే. ఏకంగా నేషనల్ అవార్డు కొల్లగొట్టింది. అంతేకాదు, అరడజను నంది అవార్డులొచ్చాయి.

కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో కీర్తిరెడ్డి హీరోయిన్ గా నటించగా దేవ సంగీతం అందించారు. జీవీజీ రాజు నిర్మించారు.