Pawan Kalyan - సంచలన నిర్ణయం

Friday,September 11,2020 - 05:45 by Z_CLU

రీఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఎనౌన్స్ చేశారు పవన్. ఎంత ఫాస్ట్ గా ఎనౌన్స్ మెంట్స్ ఇచ్చారో, ఆ ప్రాజెక్టులు కూడా అంతే ఫాస్ట్ గా సెట్స్ పైకి వచ్చేశాయి. అయితే రిలీజ్ డేట్స్ విషయంలో మాత్రం సినిమాకు-సినిమాకు మధ్య కనీసం 7 నెలల గ్యాప్ ఉంటుందని, ఏడాదికి ఒక సినిమా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకున్నారంతా. సరిగ్గా ఇక్కడే Pawan Planning బయటపడింది.

ఎంత ఫాస్ట్ గా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో, అంతే ఫాస్ట్ గా వాటిని కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు పవన్. కుదిరితే 2 సినిమాల్ని సైమల్టేనియస్ గా కంప్లీట్ చేయాలనేది ప్లాన్.

Vakeel Saab ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే Pawan-Krish మూవీ సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీతో పాటు Pawan-HarishShankar మూవీ కూడా సైమల్టేనియస్ గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

లాక్ డౌన్ వల్ల తను అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో పవన్ ఇలా సైమల్టేనియస్ షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.