జానీ సూపర్ హిట్ అయి ఉంటే...

Sunday,February 12,2017 - 01:52 by Z_CLU

పవన్ కల్యాణ్ నటించిన జానీ సినిమా ఒక్కసారిగా మళ్లీ వాార్తల్లోకొచ్చింది. ఈ సినిమా గురించి పెద్దగా ఎక్కడా మాట్లాడని పవన్ కల్యాణ్… సడెన్ గా జానీ ప్రస్తావన తీసుకొచ్చేసరికి అంతా ఆశ్చర్యపోయారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఉలిక్కిపడ్డారు కూడా. అవును మరి… జానీకి తన కెరీర్ కు అలాంటి లింక్ పెట్టారు పవర్ స్టార్.

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న పవన్ తన కెరీర్ కు సంబంధించిన విషయాల్ని ఆడియన్స్ తో పంచుకున్నారు. ఎప్పటికైనా ప్రజాసేవకే అంకితమవుతానని ప్రకటించిన పవన్… నిజానికి జానీ సినిమా టైమ్ లోనే సినిమాల నుంచి తప్పుకోవాలని అనుకున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయి ఉంటే కచ్చితంగా అదే తన ఆఖరి సినిమా అయి ఉండేదన్నారు పవన్. ఇంకెన్నాళ్లు సినిమాలు చేస్తానో చెప్పలేనని, అయితే సినిమాలంటే తనకు విముఖత అస్సలు లేదని ప్రకటించారు. ఎందుకో తన వ్యక్తిత్వానికి, సినీరంగానికి పడదని చెప్పిన పవన్… సినిమాలతో వచ్చిన ఇమేజ్ ను ఇలా ప్రజాసేవకు వినియోగించడం ఆనందంగా ఉందని ప్రకటించారు.