ఊహించని నిర్ణయం..?

Wednesday,October 05,2016 - 10:00 by Z_CLU

 పవర్ స్టార్ షాక్ ఇవ్వబోతున్నాడా…?  ఎవరూ కలలో కూడా ఊహించని నిర్ణయం తీసుకున్నాడా…? అవుననే అంటోంది టాలీవుడ్. తాజా సమాచారం ప్రకారం… పవన్ ఒకేసారి రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడట. కొంతమంది షాక్ అయినప్పటికీ… పవన్ అభిమానులకు మాత్రం ఇది పండగలాంటి న్యూసే.

pawan-kalyan-still

        ప్రస్తుతం పవన్.. కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు. అటు త్రివిక్రమ్ తో కూడా సినిమా చేస్తానని మాటిచ్చాడు. అయితే కాటమరాయుడు ప్రాజెక్టు… అనుకున్న టైమ్ కంటే కాస్త ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్ సడెన్ గా ఖాళీ అయిపోయాడు. అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడుతో పాటు త్రివిక్రమ్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడట. తాజా ప్లానింగ్ ప్రకారం… నవంబర్ లో త్రివిక్రమ్ సినిమాకు పవన్ 15 రోజులు కాల్షీట్లు ఇచ్చాడని టాక్. ఇలా ఒకేసారి రెండు సినిమాల్ని కంప్లీట్ చేయాలనేది పవన్ ప్లాన్.