పవన్, రవితేజ మల్టీస్టారర్

Wednesday,April 08,2020 - 11:55 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ మల్టీస్టారర్ సినిమా న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అవును.. రవితేజతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడన్నది ఆ వార్త. ఈ కాంబో సినిమాను డాలీ తెరకెక్కించనున్నాడని, ఈ సినిమా ఓ తమిళ్ సినిమాకు రీమేక్ గా వస్తోందనే టాక్ నడుస్తుంది.

ఇంతకీ ఆ రీమేక్ ప్రాజెక్టు ఏంటో తెలుసా? దాని పేరు విక్రమ్ వేద. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడట నిర్మాత రామ్ తళ్లూరి. ఈ రీమేక్ ప్రాజెక్టు చుట్టూ ఇప్పటికే రవితేజ పేర్లు చాన్నాళ్లుగా తిరుగుతుంది. ఇప్పుడు పవన్ పేరు కొత్తగా ప్రచారంలోకి రావడానికి కారణం నిర్మాత రామ్ తళ్లూరి. పవన్ కు ఇతడు బాగా క్లోజ్ కావడంతో ఈ గాసిప్ బయల్దేరింది.

ఈ రీమేక్ లో పవన్ నటిస్తాడా నటించడా అనే విషయాన్ని పక్కనపెడితేత.. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. వకీల్ సాబ్ తో పాటే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవర్ స్టార్.. త్వరలోనే హరీష్ శంకర్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తాడు. హరీష్ శంకర్ సినిమా ఎండింగ్ కి వచ్చాక గానీ ఈ రీమేక్ పై క్లారిటీ రాదు. అప్పటివరకు ఇది పుకారే.