Pawan-Rana: జనవరి నుంచి సెట్స్ పైకి

Monday,December 21,2020 - 01:20 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మల్టీస్టారర్ కు అంతా సెట్ అయింది. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది. PawanRana హీరోలుగా రాబోతున్న ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి రానుంది.

మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా రాబోతోంది పవన్-రానా సినిమా. సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. త్రివిక్రమ్ (Trivikram) డైలాగ్స్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

Pawan_rana_multi_starrer_ayyappanum_koshiyum_remake_launch-zeecinemalu 1

వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది. కొన్ని రోజుల షెడ్యూల్ పూర్తయిన తర్వాత కీలకమైన భారీ షెడ్యూల్ కోసం యూనిట్ అంతా కలిసి పొలాచ్చి వెళ్తుంది. మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే పూర్తిచేయబోతున్నారు.

సినిమాలో పవన్ సరసన సాయిపల్లవి (SaiPallavi) హీరోయిన్ గా నటించనుంది. రానా సరసన ఐశ్వర్యరాజేష్ (Aishwarya Rajesh) ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. 2021లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Check – పవన్-రానా మూవీ లాంఛ్ స్టిల్స్