కొత్త ఏడాదిలో చరణ్-పవన్ కాంబినేషన్?

Wednesday,December 25,2019 - 01:11 by Z_CLU

పవన్ కేవలం హీరో మాత్రమే కాదు, అతడికి ఓ బ్యానర్ కూడా ఉంది. పవన్ నటించిన 2-3 సినిమాలకు అతడి బ్యానర్ పేరు కూడా పడింది. అంతెందుకు.. నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా నిర్మాతల్లో పవన్ కూడా ఒకడు. ఇప్పుడు తన బ్యానర్ పై మరో సినిమా నిర్మించబోతున్నాడు పవర్ స్టార్.

రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తానని చాన్నాళ్లుగా చెబుతున్నాడు పవన్. ఇప్పుడా ప్రాజెక్టు పనులు అన్-అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాయి. అవన్నీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే, 2020 జూన్ లేదా మే నెలలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ గ్యాప్ లో RRRను కంప్లీట్ చేయడంతో పాటు.. కొరటాల-చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమాను కూడా నిర్మాతగా ఓ కొలిక్కి తీసుకురాబోతున్నాడు చరణ్. పవన్-చెర్రీ కాంబోలో వస్తున్న సినిమాకు డైరక్టర్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.