Pawan-Prabhas ప్లానింగ్ అదుర్స్ !

Tuesday,September 01,2020 - 12:01 by Z_CLU

స్టార్ హీరోలెవరైనా ఒక సినిమా సెట్ పై ఉండగా మరో సినిమా అనౌన్స్ చేయడం సహజమే. కానీ ఒక సినిమా సెట్ పై ఉండగా ఏకంగా రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టుకుంటే అది ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు Pawan Kalyan, Prabhas లైనప్ ఫ్యాన్స్ లో అలాంటి ఆసక్తి కలిగిస్తుంది. ఏడాదికో సినిమా ప్లాన్ చేసుకునే ఈ స్టార్ హీరోలు ఇప్పుడు ఏకంగా మూడు నాలుగేళ్ల వరకు తమ డైరీ ఫుల్ అని చెప్పేసారు.

‘అజ్ఞాతవాసి’ తర్వాత రెండేళ్ళు సినిమాకి దూరంగా ఉన్నా PowerStar మళ్ళీ ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ మొదలు పెట్టేసాడు. ఆ సినిమా ప్రారంభమైన కొన్ని రోజులకే Harish Shankar తో మరో సినిమా అనౌన్స్ చేసాడు. అంటే ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. రేపు పవన్ పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమా కూడా ఎనౌన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఇక ‘Saaho’ కోసం ఏకంగా రెండేళ్ళు కేటాయించిన Prabhas కూడా స్పీడు పెంచి వరుసగా మూడు ప్రాజెక్ట్స్ సెట్ చేసుకొని వాటిలో రెండు ఎనౌన్స్ చేసాడు. ప్రస్తుతం ‘RadheShyam’ షూటింగ్ స్టేజిలో ఉండగానే దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ను అలాగే బాలీవుడ్ డైరెక్టర్ Om Raut తో ‘Adipurush’అంటూ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేసి మూడేళ్ళ వరకూ బిజీ అంటూ చెప్పకనే చెప్పేశాడు. త్వరలోనే ఇంకో సినిమాను కూడా ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు రెబెల్ స్టార్.

సో.. స్టార్ హీరోల్లో ఇలా వరుస పెట్టి మూడు సినిమాలు లైన్లో పెట్టి మిగతా హీరోలకంటే తాము జెట్ స్పీడ్ లో సినిమాలు చేయబోతున్నామని ఫ్యాన్స్ కి చెప్తున్నారు Pawan , Prabhas.