పవన్, నితిన్ సినిమా అప్ డేట్స్

Tuesday,June 06,2017 - 10:03 by Z_CLU

నితిన్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ నిర్మాతలుగా ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.. లాస్ట్ ఇయర్ నవంబర్ లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకొని త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది.

మొన్నటి వరకూ ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని వెయిట్ చేసిన ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా ఈ నెల 26 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్‌ అందించిన మూలకథకు కృష్ణచైతన్య స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసేసిన కృష్ణ చైతన్య ఈ సినిమాతో నితిన్ ను సరి కొత్త క్యారెక్టర్ లో చూపిస్తూ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లై’ సినిమా చిత్రీకరణ నిమిత్తం అమెరికాలో ఉన్న నితిన్ ఈనెల 14 తో ఆ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకొని 26 నుంచి ఈ సినిమాను సెట్స్ పై లో పాల్గొంటాడట..