తదుపరి త్రివిక్రమ్ తో సిద్దమవుతున్న పవన్

Monday,August 08,2016 - 06:44 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో నటించబోయే సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా సెట్స్ పైకి త్వరలోనే అడుగుపెట్టి…. అంతే వేగంగా చిత్రీకరణ పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమా తరువాత వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు పవర్ స్టార్.

     ఈ సినిమాను త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తారనే వార్త వినిపిస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇక ఇదిలా ఉంటే పవన్…. దాసరి నిర్మాణంలో ఓ సినిమా చెయ్యాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరి నిర్మాతల్లో ఎవరితో పవన్ తదుపరి కమిట్ అవుతాడో? చూడాలి.