పవన్ లిస్ట్ లో స్టార్ డైరెక్టర్....

Sunday,February 05,2017 - 11:15 by Z_CLU

ప్రెజెంట్ ‘కాటమరాయుడు’ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కే సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు నేసన్ తోనూ ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకురాావాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో పాటు మరో స్టార్ డైరెక్టర్ తో కూడా పవన్ ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నట్టు టాలీవుడ్ టాక్.

హ్యాట్రిక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న కొరటాల శివతో ఈ మూడు సినిమాల తర్వాత ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడట పవన్. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని.. కొరటాల చెప్పిన పాయింట్ పవన్ కు బాగా నచ్చిందని.. ఈ సినిమాను దాసరి నారాయణరావు నిర్మిస్తారని సమాచారం. మరి ఈ కాంబో గనుక త్వరలోనే సెట్స్ పైకి వెళ్తే  పవన్ ఫాన్స్ కి పండగే.