ఈసారి ఛాన్స్ ఎవరికి..?

Thursday,October 13,2016 - 12:43 by Z_CLU

ఓ వైపు కాటమరాయుడు సినిమా సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ డైరక్షన్ లో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టుకు దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాటమరాయుడు తర్వాత ఇక త్రివిక్రమ్ సినిమానే అనుకుంటున్న టైమ్ లో… సరిగ్గా విజయ దశమి రోజే  ఎక్స్ పెక్ట్ చేయని అనౌన్స్ మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

pawan-opening-1

 తమిళ దర్శకుడు నేసన్ డైరక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఏఎం రత్నం సమర్పణలో రానున్న ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. దీంతో కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్, నేసన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తాడనే టాపిక్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

pawan-trivikram

    కాటమ రాయుడు ఆల్ రెడీ సెట్స్ పై ఉంది కాబట్టి అది కనీసం 50శాతం అయినా కంప్లీట్ అయిన తర్వాతే మరో సినిమా సెట్స్ పైకి షిఫ్ట్ అవుతాడు పవన్. మరి అటు త్రివిక్రమ్, ఇటు నేసన్ ఇద్దరి సినిమాల్లోనూ ముందుగా సెట్స్ పైకి వెళ్ళే సినిమా ఏది..? కాటమరాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ వేయనున్న ఆ ఒక్క అడుగు ఏ దర్శకుడి వైపు పడనుంది. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.