షాక్ ఇచ్చిన పవన్...

Tuesday,October 11,2016 - 11:25 by Z_CLU

పవన్ స్పీడ్ పెంచాడు. ఒకేసారి మూడు సినిమాలతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వం లో ‘కాటమరాయుడు’ సినిమాను సెట్స్ పై పెట్టిన పవర్ స్టార్.. సడెన్ గా మరో సినిమాను స్టార్ చేశాడు. గతంలో ‘గబ్బర్ సింగ్’, ‘గోపాల-గోపాల’ వంటి రీమేక్ సినిమాలతో గ్రాండ్ హిట్స్ అందుకున్న పవన్ తాజాగా మరో రీమేక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
pawan-kalyan pavan-movie-opening
అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాలమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయయబోతున్నాడు పవర్ స్టార్. విజయదశమి సందర్బంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఏ.ఎం రత్నం ఆఫీస్ లో జరిగిన ఈ చిత్ర పూజ కార్యక్రమంలో పవన్ కూడా పాల్గొని పూజలు నిర్వహించాడు. ఈ సినిమాతో పాటు త్వరలోనే త్రివిక్రమ్ సినిమాను కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్.