పవన్ సినిమా రిలీజ్ కి రెడీ

Sunday,November 27,2016 - 02:02 by Z_CLU

అదేంటి పవర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది కదా అప్పుడే వచ్చేయడం ఏంటి? అనుకుంటున్నారా? అవునండి పవన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉంది. అయితే ఇది పవన్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ కాదు. కమెడియన్ సప్తగిరి హీరోగా మారి తెరకెక్కిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’.
pawan-1
ఈ సినిమాకు పవన్ కు మధ్య సంబంధం కొత్తగా చెప్పక్కర్లేదు. పవన్ సినిమాకు టైటిల్ త్యాగం చేసి పవన్ మనసులో మంచి స్థానం సంపాదించున్నారు ఈ సినిమా యూనిట్.  తన ఫ్యామిలీ ఫంక్షన్స్ కు కూడా దూరంగా ఉంటున్న పవర్ స్టార్.. ఈ యూనిట్ కోసం సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో విడుదల ఈవెంట్ కు ప్రత్యేక అతిగా హాజరయ్యాడు. ఇక ఇదే వేదికపై ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాని ఖచ్చితంగా విడుదలైన వెంటనే ఓ స్పెషల్ షో వేయించుకొని మరీ చూస్తానని చెప్పుకొచ్చాడు పవన్. అప్పట్నుంచి సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా పవన్ సినిమాగా మారిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా… డిసెంబర్ చివరి వారంలో విడుదల కానుంది.