టాలీవుడ్ రేసుగుర్రాలు

Tuesday,November 08,2016 - 12:31 by Z_CLU

పవన్ కల్యాణ్,మహేష్ బాబు ఇద్దరూ ఇప్పుడు ఒకే ట్రాక్ లో బుల్లెట్ ట్రయిన్స్ లా దూసుకుపోతున్నారు. మొన్నటివరకు ఓ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే మరో సినిమా మొదలుపెట్టేవారు. కానీ ఇప్పుడీ ఇద్దరు మిత్రులు ఒకేసారి గేర్ మార్చారు. మూడేసి సినిమాలతో హల్ చల్ చేస్తున్నారు.

pawan-kalyan-759

ప్రస్తుతం కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే నేసన్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏఎం రత్నం సమర్పణలో ఆ సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టాడు. ఇదే గొప్ప విషయం అనుకుంటే… తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా లాంచ్ చేశాడు.

superstar-mahesh-babu

 

ఇక మహేష్ విషయానికొద్దాం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రేపు కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నాడు. మరోవైపు పీవీపీ బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా కూడా ఓకే చేశాడు. ఇలా మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న సూపర్ స్టార్స్ ఇద్దరూ సడెన్ గా వయొలెంట్ గా మారడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.