సాయితేజ్ మూవీ లాంఛ్ చేసిన పవన్

Thursday,March 12,2020 - 11:54 by Z_CLU

సాయితేజ్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సినిమాకు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. పవర్ స్టార్ క్లాప్ తో ఈ సినిమా అఫీషియల్ గా లాంఛ్ అయింది. జేబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భగవాన్-పుల్లారావు నిర్మాతలుగా ఈ సినిమా రాబోతోంది.

లాంగ్ గ్యాప్ తర్వాత దేవ్ కట్టా ఈ సినిమాతో మరోసారి దర్శకుడిగా తన లక్ చెక్ చేసుకోబోతున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ మూవీలో సాయితేజ్ సరసన నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటించనుంది. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో చిత్రలహరి సినిమా వచ్చింది.

ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. అది పూర్తయిన వెంటనే ఫుల్ లెంగ్త్ ఈ సినిమాకే టైమ్ కేటాయిస్తాడు. ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్టుకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సాయితేజ్ సినిమాకు మెలొడీ బ్రహ్మ మ్యూజిక్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్. మూవీ ఓపెనింగ్ కు అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.