రేపట్నుంచి పవన్-క్రిష్ సినిమా షూటింగ్

Friday,February 21,2020 - 10:41 by Z_CLU

వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో పవన్ లేడు. సెకెండ్ షెడ్యూల్ నుంచి జాయిన్ అవుతాడు. ఆ షెడ్యూల్ రేపట్నుంచి ప్రారంభం కాబోతోంది.

పీరియాడిక్ డ్రామాగా వస్తోంది క్రిష్-పవన్ సినిమా. ఈ మూవీ కోసం ఇప్పటికే భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. క్రిష్ మూవీకి పవన్ బల్క్ లో కాల్షీట్లు కేటాయించాడు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమానే షూట్ చేయబోతున్నాడు.

క్రిష్ మూవీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత వకీల్ సాబ్ (పింక్ రీమేక్)ను తిరిగి ప్రారంభిస్తాడు పవన్. ఈ గ్యాప్ లో వకీల్ సాబ్ కు సంబంధించి హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల్ని పూర్తిచేస్తారు. ఇలా సైమల్టేనియస్ గా అటు క్రిష్ మూవీని, ఇటు దిల్ రాజు సినిమాను పూర్తిచేయబోతున్నాడు పవన్.