కాటమరాయుడు రిలీజ్ డేట్ ఫిక్స్

Tuesday,October 25,2016 - 11:00 by Z_CLU

కాటమరాయుడు టార్గెట్ సెట్ చేసేసుకున్నాడు. సినిమా లాంచ్ చేయడానికైనా కాస్త టైం తీసుకుంటాడేమో కానీ ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే ప్యాకప్ చెప్పాక కానీ ఊపిరి తీసుకోడు పవర్ స్టార్. ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటున్న “కాటమ రాయుడు” యూనిట్ మార్చి 29 న సినిమా రిలీజ్ అనౌన్స్ చేసేసింది.

పవర్ స్టార్ కరియర్ లోనే మార్చిలో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా కాటమరాయుడు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసీ చేయగానే బోలెడంత హైప్ ని సొంతం చేసుకున్న కాటమరాయుడు ముందుగానే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

sardar-gabbar-singh

ఈ ఏడాది ఉగాది రోజున సర్దార్ గబ్బర్ సింగ్ ను విడుదల చేశాడు పవన్ కల్యాణ్. వచ్చే ఏడాది ఉగాదికి కాటమరాయుడును రెడీ చేస్తున్నాడు.