అఫీషియల్.. పింక్ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,February 03,2020 - 12:26 by Z_CLU

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 15న విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాను మే 22న విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ తేదీ కంటే వారం ముందే థియేటర్లలోకి రావాలని డిసైడ్ అయ్యారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది పింక్ రీమేక్. అంజలి, అనన్య, నివేత థామస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. ఉగాదికి (మార్చి 25) సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ఎనౌన్స్ చేశాడు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు. త్వరలోనే ఈ సెట్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.