BheemlaNayak సంక్రాంతి బరిలో పవర్ స్టార్

Tuesday,November 16,2021 - 01:46 by Z_CLU

Pawan Kalyan’s ‘Bheemla Nayak’ in Sankranthi Race !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్‘ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందు నుండి మేకర్స్  చెప్పినట్టే వచ్చే సంక్రాంతి కి సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. నిజానికి ఊహించని విధంగా ‘RRR’ సంక్రాంతి 2022 రేస్ లో నిలిచే సరికి ‘రాధే శ్యామ్‘ మినహా దాదాపు అన్ని బడా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మహేష్ ‘సర్కారు వారి పాట‘, వెంకీ , వరుణ్ ‘F3’ సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నాయి.  అదే కోవలో ‘భీమ్లా నాయక్’ కూడా వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాన్ కూడా సంక్రాంతి రేస్ లోనే నిలిచి చర్చకి తెరలేపాడు.

BheemlaNayak-release-date-poster-zeecinemalu

జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అంటూ మేకర్స్ పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు. దీంతో వచ్చే సంక్రాంతి సినిమాలపై గట్టి చర్చ నడుస్తుంది. జనవరి 7 న ఎన్టీఆర్ , రామ్ చరణ్ మల్టీ స్టారర్ ‘RRR’ థియేటర్స్ లోకి రానుంది. ఆర్ ఆర్ ఆర్ వచ్చిన  ఐదు రోజులకే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే జనవరి 14న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజవుతుంది.

ఇలా వరుస పెట్టి బడా సినిమాలు సంక్రాంతి రేస్ లో నిలిచాయి. ఈసారి క్రేజ్ ఉన్న బడా హీరోల మధ్య పోటీ ఉండటంతో సంక్రాంతి సీజన్ సినిమాలపై ట్రేడ్ పరంగా హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ మూడు బడా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాయా ? అని మూవీ లవర్స్ కూడా ఇప్పటి నుండే మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా వచ్చే సంక్రాంతి ఈ భారీ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics