మార్చి 14 నుండి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా

Monday,February 13,2017 - 03:08 by Z_CLU

కాటమరాయుడు సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ అయింది. ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న కాటమరాయుడు సినిమాతో పాటు, పనిలో పనిగా ఈ సినిమాపై కూడా ఓ లుక్ వేసి ఉంచారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

పవన్ కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందో లేదో, సినిమా ప్రీ ప్రొడక్షన్ బిగిన్ చేసేసిన త్రివిక్రమ్, కాటమ రాయుడు ఇంకా అఫీషియల్ గా ప్యాకప్ కూడా చెప్పలేదు, ఈ లోపు తన సినిమాని  సెట్స్ పైకి తీసుకు రావడానికి కావలసిన సరంజామా అంతా ఆల్ రెడీ సర్దిపెట్టుకున్నాడు. స్క్రిప్ట్ ఇలా ఫిక్స్ అయ్యిందో లేదో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ ని హీరోయిన్స్ గా ఫైనల్ కూడా చేసేసుకున్నాడు.

pawan-kalyan-trivikram-next

మరోవైపు రేపోమాపో కాటమరాయుడు యూనిట్ సినిమాకి ప్యాకప్ చెప్పే స్టేజ్ కి రీచ్ అవ్వడం తో ఇటు త్రివిక్రమ్ సినిమా యూనిట్ అలర్ట్ అవుతుందని చిన్న అప్ డేట్ ఒకటి టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. దానికి తోడు, కాటమరాయుడు తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకునే ఆలోచనలో లేని పవన్ కళ్యాణ్ మార్చి 14 నుండి సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నాడని కూడా టాక్, ఉన్న కాన్సంట్రేషన్ ని కూడా తన వైపు తిప్పుకుంటుంది.

Pawan Kalyan in Attarintiki Daredi New Images

పవన్ కళ్యాణ్ టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎలా ఉండబోతుందో తెలీదు కానీ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ పైకి రాబోతుందనే బజ్ మాత్రం సమ్మర్ కన్నా ముందే టాలీవుడ్ హీట్ ని జెనెరేట్ చేస్తుంది.