పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా అప్ డేట్స్

Sunday,June 18,2017 - 09:35 by Z_CLU

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో న్యాచురల్ గానే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ఫిక్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పవర్ టీమ్, సినిమాని అంతే పవర్ ప్యాక్డ్ ఇమోషన్ ఎంటర్ టైనర్ గా సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

 

ప్రస్తుతం హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో సూపర్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే పనిలో ఉంది సినిమా యూనిట్. దాని కోసం సినిమా సెట్స్ పైకి రాకముందే రెడీ చేసుకున్న ‘కెఫే’ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది సినిమా యూనిట్. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.