పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా బిగిన్ అయింది

Monday,April 03,2017 - 12:15 by Z_CLU

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఓ సెట్ నిర్మించారు. ఆ సెట్ లోనే హీరోయిన్ అనూ ఇమ్మాన్యువెల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

5 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ తరవాత చిన్న బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, నెక్స్ట్  షెడ్యూల్ ని రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేస్తున్నారు. నెలరోజుల పాటు జరిగే ఈ రెగ్యులర్ షూటింగ్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ నటిస్తున్న ఈ సినిమాకి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే 3 పాటలకి ఆల్రెడీ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.