పవన్ ప్లాన్ అదే ..

Friday,December 16,2016 - 07:00 by Z_CLU

పవర్ స్టార్ ఒక్క సారి ప్లాన్ ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకెళ్తాడన్న విషయం తెలిసిందే. ప్రెజెంట్ డాలీ డైరెక్షన్ లో ‘కాటమరాయుడు’ సినిమాలో నటిస్తున్న పవన్ తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టి ప్లాన్ రెడీ చేస్తున్నాడట. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ ను జనవరి కల్లా ఫినిష్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట పవన్ .

end-of-pawan-trivikram-friendship_b_2707151246-1

  ఈ సినిమా ను జనవరి కి ఫినిష్ చేసి ఫిబ్రవరి నుంచి త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోయే తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పై పెట్టేందుకు రెడీ అవుతున్నాడట. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాకు హీరోయిన్స్ తో పాటు మిగతా ఆర్టిస్టులు కూడా ఫైనల్ అవ్వడం తో లొకేషన్స్ వేటలో పడ్డాడట త్రివిక్రమ్. ఫిబ్రవరి లో సెట్స్ పై కి వెళ్లనున్న ఈ సినిమా తో ఆగస్టు లో ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ కి రావాలని ఫిక్స్ అయ్యాడట పవర్ స్టార్. మరి పవన్ ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో? చూడాలి..