పవర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా ‘నేలటికెట్’ ఆడియో లాంచ్

Saturday,May 05,2018 - 02:34 by Z_CLU

మే 24 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది రవితేజ ‘నేలటికెట్’. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 10 న గ్రాండ్ ఆడియో రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నాడు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అఫీషియల్ గా కన్ఫమ్ చేసింది. దాంతో ఈ సినిమాపై  మరింత బజ్ క్రియేట్ అవుతుంది.

‘నేలటికెట్’ టీజర్ రిలీజయినప్పటినుండే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఈ టీజర్ లో  సినిమా స్టోరీలైన్ పెద్దగా రివీల్ కాకపోయినా, కళ్యాణ్ కృష్ణ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్, సినిమా సమ్ థింగ్ స్పెషల్ గ్యారంటీ అనే క్యూరియాసిటీని జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయింది. దానికి తోడు ఈ సినిమా ఆడియో లాంచ్ కి పవణ్ కళ్యాణ్ అటెండ్ కావడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ అవుతుంది.

శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. రామ్ తాళ్ళూరి ఈ సినిమాను SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.