ఈ సినిమా నేను తప్పకుండా చూస్తా – పవన్ కళ్యాణ్

Friday,May 11,2018 - 10:06 by Z_CLU

సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అల్లు అర్జున్ నా పేరు సూర్య. బన్నిని మోస్ట్ అగ్రెసివ్ మిలిటరీ ఆఫీసర్ గా ప్రెజెంట్ చేసిన  ఈ సినిమా, రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అందుకే ‘థాంక్ యూ ఇండియా మీట్’ పేరిట సక్సెస్ మీట్ జరుపుకుంది నా పేరు సూర్య టీమ్. ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడంతో, ఈ ఈవెంట్ కి మరింత క్రేజ్ పెరిగింది.

“ఈ సినిమా నాగబాబు గారు నిర్మించిన విషయం ఇప్పటి వరకు నాకు తెలీదు… మేమెప్పుడు కలిసినా సినిమా గురించి పెద్దగా డిస్కస్ చేసుకోము. బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చూడటం నాకు కుదరలేదు కానీ, ఈ సినిమాను తప్పకుండా చూస్తా… ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే, తప్పకుండా చూడాల్సిన అనిపిస్తుంది” అని చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్.

ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన వక్కంతం వంశీ ఒక్క సినిమాతోనే కమర్షియల్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విశాల్ – శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.