Pawan Kalyan - మళ్లీ పాత లుక్ లోకి
Wednesday,November 04,2020 - 01:18 by Z_CLU
పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే ప్రస్తుతం మనకు గుర్తొచ్చేది గుబురు గడ్డం, పొడవాటి జుట్టు. 4 నెలలుగా దీక్ష చేస్తున్న పవన్ పూర్తిగా మారిపోయాడు. నితిన్ పెళ్లిలో పవన్ ను చూసి చాలామంది ఎవరో బాబా అనుకున్నారు.

అలా ఎవ్వరూ ఊహించని విధంగా తయారైన పవన్ కల్యాణ్, మళ్లీ తన ఓల్డ్ లుక్ లోకి వచ్చేశాడు. గడ్డం ట్రిమ్ చేశాడు. జుట్టు కట్ చేశాడు. పనిలోపనిగా వకీల్ సాబ్ మూవీ సెట్స్ పైకి వచ్చేశాడు.
పవన్ న్యూ లుక్ ను ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి బయటపెట్టాడు. అతడితో ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టాడు.
గుబురు గడ్డం, జులపాల జుట్టుతోనే Pawan Kalyan, Vakeel Saab లో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. ఆ పుకార్లకు తాజా లుక్ తో చెక్ పెట్టాడు పవర్ స్టార్.