నితిన్ ని అంతగా ఇష్టపడటానికి రీజన్ అదే – పవన్ కళ్యాణ్

Thursday,March 29,2018 - 10:07 by Z_CLU

 నితిన్ హీరోగా నటించిన హిలేరియస్ లవ్ ఎంటర్ టైనర్ ‘ఛల్ మోహన రంగ’. ఏప్రిల్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్, సాంగ్స్ తో పాటు, పవన్ కళ్యాన్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి, ఈ సినిమాకి మరింత హైప్ క్రియేట్ అవుతుంది. రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించాలని  ఎందుకు అనుకున్నాడో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.

“ నా కరియర్ లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, నితిన్ కరియర్ లో కూడా సక్సెస్ లు ఉన్నాయి, ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ సక్సెస్ లో అయినా ఫెయిల్యూర్ లో కూడా నిలకడగా ఉంటాడు నితిన్. అందుకే నాకు నితిన్ అంటే  చాలా ఇష్టం. దాంతో పాటు కృష్ణ చైతన్య స్క్రిప్ట్ ఈ సినిమాకి బలం.అందుకే ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా భాగమవ్వాలనుకున్నాను” అని మనసులో మాట చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్.

నితిన్ సరసన మేఘా ఆకాష్ నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. M. సుధాకర్ రెడ్డి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హిలేరియస్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నాయి.