BheemlaNayak టీజర్ అప్డేట్ వచ్చేస్తుంది

Thursday,November 25,2021 - 06:58 by Z_CLU

Pawan Kalyan , Rana’s ‘Bheemla Nayak’ Teaser update soon!

పవన్ కళ్యాణ్ , రానా కాంబినేషన్ లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రాబోతున్న ‘భీమ్లా నాయక్’  వచ్చే సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. డిసెంబర్ రెండో వారంలో టీజర్ , జనవరి ఫస్ట్ వీక్ లో ట్రైలర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో గ్లిమ్స్ వదిలిన మేకర్స్ ఇప్పుడు టీజర్ కట్ చేయించే పనిలో ఉన్నారు. దర్శకుడు సాగర్ కే చంద్ర తో పాటు స్క్రీన్ ప్లే -మాటలు అందించిన త్రివిక్రమ్ కూడా టీజర్ కట్ ని దగ్గరుండి సెట్ చేస్తున్నాడట. ఈసారి పవన్ -రానా విజువల్స్ , డైలాగ్స్ తో టీజర్ రాబోతుందని సమాచారం. ఆ వెంటనే ట్రైలర్ రిలీజ్ అవ్వనుంది.

బ్యాక్ టు బ్యాక్ టీజర్ , ట్రైలర్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేసి  భారీ హైప్ తీసుకొచ్చే  ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా , రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics