Bheemla Nayak షూటింగ్ పూర్తి... రెడీ ఫర్ రిలీజ్!

Wednesday,February 16,2022 - 06:32 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే  సాంగ్ మినహా షూటింగ్ ఫినిష్ చేసిన యూనిట్ తాజాగా బ్యాలెన్స్ సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. సెట్ లో పవర్ స్టార్ తో దిగిన ఫోటో షూటింగ్ అప్ డేట్ ఇచ్చి ఈ విషయాన్ని తెలియజేశాడు సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్.

Bheemlanayak-shoot-wrapped-up-zeecinemalu

హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ షెడ్యుల్ తో టోటల్ షూట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. ప్రకటించినట్లే ఫిబ్రవరి 25న సినిమాను థియేటర్స్ లోకి రాబోతున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమా రిలీజ్ అవ్వనుంది. వచ్చే వారం వరకూ ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ జరిపించేట్లుగా ప్లాన్ చేస్తున్నారు.

Also Read Sarkaru Vaari Paata shooting updates

పవన్ కళ్యాణ్ , రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ , సంయుక్త హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే -డైలాగ్స్ అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ రీమేక్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics