Pawan Corona - ప్రస్తుత పరిస్థితేంటి?

Saturday,April 24,2021 - 05:57 by Z_CLU

రీసెంట్ గా ఓ సెక్షన్ మీడియా పవన్ కు కరోనా నెగెటివ్ వచ్చిందని, ఆయన పూర్తిగా కోలుకున్నారని చెప్పుకొచ్చింది. అది కొంత నిజం కావొచ్చు. కానీ పవన్ మాత్రం క్వారంటైన్ లో ఉండడానికే డిసైడ్ అయ్యారు. అవును.. పవన్ కల్యాణ్ ఇంకా హోం ఐసొలేషన్ లోనే ఉన్నారు. హైదరాబాద్ శంకరపల్లిలోని తన ఫామ్ హౌజ్ లో పవన్ కల్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.

పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది. పవన్ కు CT స్కాన్ తీసిన టైమ్ లో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరినట్టు డాక్టర్లు గుర్తించారు. ఆ యాంగిల్ లోనే ట్రీట్ మెంట్ కూడా చేశారు. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని తెలుకున్నది కూడా ఈ CT స్కాన్ ద్వారానే.

కాబట్టి.. ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో కోలుకొని, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని నిర్థారించుకున్న తర్వాతే కాలు బయటపెట్టాలని పవన్ నిర్ణయించుకున్నారు. అందులో డోస్ మొత్తం పూర్తయినంతవరకు క్వారంటైన్ లో ఉండిపోయారు. సోమవారం పవన్ కు స్కానింగ్ చేసే అవకాశం ఉంది. ఆ స్కానింగ్ లో వైరస్ లేదని నిర్థారణ అయిన తర్వాత మాత్రమే పవర్ స్టార్ బయటకు వస్తారు. అప్పటివరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు.

రీసెంట్ గా పవన్ నటించిన కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ థియేటర్లలోకి వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్టయింది. ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఉంది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఈ రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేస్తారు పవన్. ఆ తర్వాతే హరీష్ శంకర్ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతారు.

ప్రస్తుతానికైతే పవన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఎందుకైనా మంచిదని ముందుజాగ్రత్తగా మరికొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంటున్నారు. స్కానింగ్ తర్వాత క్వారంటైన్ నుంచి బయటకొస్తారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics