అంతా పవన్ బాబాయే చేశాడు

Tuesday,November 15,2016 - 10:03 by Z_CLU

టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలున్నా, అందునా ఎంత మంది మెగా హీరోలున్నా వరుణ్ తేజ్ ది ప్రత్యేక స్థానం. వరుణ్ తేజ్ కరియర్ గ్రాఫ్ చూస్తే, తను సినిమాల్లోకి వచ్చే కన్నా ముందే, తన కరియర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడనిపిస్తుంది.

సినిమా సినిమాకి డిఫెరెన్స్, లుక్స్ దగ్గరి నుంచి పర్ఫార్మెన్స్ వరకు ప్రతి సినిమాలో ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వరుణ్ తేజ్, తన కరియర్ గ్రోత్ లో పవర్ స్టార్ రోల్ చాలా ఉందని చెప్పుకున్నాడు.

“జస్ట్ ఆక్ట్ చేద్దామని ఇండస్ట్రీకి వస్తే సరిపోదు, ఆడియెన్స్ తన విలువైన టైం ని, మనీని స్పెండ్ చేసి మరీ నిన్నో యాక్టర్ లా రిసీవ్ చేసుకోవాలంటే, నువ్వు సం థింగ్ స్పెషల్ అనిపించుకోవాలి. ఆ యూనిక్ నెస్ నీలో ఉంటేనే కానీ సినిమా ఇండస్ట్రీకి పనికి రావు” అని బిగినింగ్ లోనే పవర్ స్టేట్ మెంట్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్. వరుణ్ తేజ్ ముందు ఆ స్టేట్మెంట్ పై వర్కవుట్ చేసి గానీ, ఫస్ట్ సినిమాకు సంతకం చేయలేదట.