పవన్ కళ్యాణ్ ‘పింక్’ యాక్షన్ తో షురూ

Saturday,January 18,2020 - 11:02 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘పింక్’ షూటింగ్ కి రెడీ అయింది. ఈ నెల 20 నుండి సెట్స్ పైకి రానుందీ సినిమా. అయితే మొదటి షెడ్యూల్ లోనే పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సినిమా షూటింగ్ బిగిన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో పవర్ స్టార్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తరవాత ఇదే సినిమా తమిళంలో రీమేక్ అయింది. అజిత్ నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరవాత ఇదే సినిమా రీమేక్ తో మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి రాబోతున్నాడు.

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేత థామస్, అంజలి లీడ్ రోల్ ప్లే చేయబోతున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.