పవన్ కళ్యాణ్ నితిన్ సినిమా షురూ

Monday,July 24,2017 - 03:48 by Z_CLU

నితిన్ కొత్త సినిమా బిగిన్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మిస్తున్న సినిమా ఈ రోజు నుండి మరో 5 రోజుల వరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ తరవాత U.S. లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్, సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించనుంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘ ఆకాశ్ హీరోయిన్ గా నటించనుంది.

ఈ సినిమా లాంచ్ అయినప్పుడే ఈ కాంబినేషన్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.