పవర్ స్టార్ నెక్స్ట్ సినిమా సెట్స్ పైకి

Friday,March 17,2017 - 08:13 by Z_CLU

కాటమరాయుడు సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆడియో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సినిమా మార్చి 24 న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇవి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్టెస్ట్ టాపిక్స్. కానీ కాటమరాయుడు ఫీవర్ ఓ వైపు పీక్ స్టేజ్ లో ఉండగానే ఎప్పటి నుండో ప్లానింగ్ లో ఉన్న త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాకి కావాల్సిన సరంజామా అంతా సర్దేసి, యాక్షన్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు.

కాటమరాయుడు తరవాత ఏ మాత్రం లాంగ్ బ్రేక్స్ లాంటివి తీసుకునే ఆలోచనలో లేని పవర్ స్టార్ ఇమ్మీడియట్ గా త్రివిక్రమ్ కి లాంగ్ లాంగ్ బ్యాక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈలోపు హీరోయిన్స్ దగ్గరి నుండి టెక్నీషియన్స్ వరకు ఆల్ రెడీ ఫిక్స్ అయి ఉన్న త్రివిక్రమ్ ఏప్రియల్ ఫస్ట్ వీక్ నుండే సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాడు.

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉండగానే మ్యాగ్జిమం పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకున్న త్రివిక్రమ్ ఇప్పటికే 3 సాంగ్స్ ని ఫైనలైజ్ కూడా చేసేశాడని తెలుస్తుంది. అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.