పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీస్

Thursday,July 20,2017 - 10:02 by Z_CLU

రీసెంట్ గా ‘కాటమరాయుడు’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ ఓ మూడు సినిమాలతో బిజీ కానున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాను సెట్స్ పై పెట్టి బిజీ గా గడుపుతున్న పవన్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు.


ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో రాధా కృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ స్పీడ్ పెంచేశాడు. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం బల్గేరియాలో నెల రోజుల పాటు రెగ్యులర్ జరుపుకొని హైదరాబాద్ తిరిగి చేరుకోనుంది యూనిట్. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ జరుపుకునుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని హారిక & హాసిని బ్యానర్ నిర్మిస్తుంది.

త్రివిక్రమ్ తో సినిమా ఫినిషింగ్ స్టేజికొచ్చాక సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు పవన్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని సమాచారం. ప్రెజెంట్ స్రిప్ట్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడట పవన్.


పవన్ అకౌంట్ లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న మరో డైరెక్టర్ ఆర్.టి. నేసన్. కోలీవుడ్ లో డైరెక్టర్ గా సత్తా చాటుకున్న ఈ దర్శకుడితో ఓ సినిమాను ప్లాన్ చేసిన పవన్ ఇటీవలే ఆ సినిమాను సంబంధించి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు. ఎ.ఎం.రత్నం నిర్మాణం లో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా ఈ ఏడాదే పవన్ సెట్స్ పై పెట్టె ఛాన్స్ ఉంది. సో ఈ మూడు సినిమాలతో ప్రెజెంట్ పవన్ డైరీ ఫుల్ అయిపోయిందన్న మాట..