అక్టోబర్ లో పవన్ సినిమా రిలీజ్?

Tuesday,June 27,2017 - 01:22 by Z_CLU

పవన్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా సెప్టెంబర్ నుంచి పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ మూవీని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నట్టు టాక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ చివరి వారంలో పవన్-త్రివిక్రమ్ సినిమా థియేటర్లలోకి వస్తుందట.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ ప్రాజెక్టుకు ఇంకా పేరు పెట్టలేదు. సెప్టెంబర్ మొదటి వారానికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం సారధి స్టుడియోస్, శంషాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

మూవీలో వెంకటేశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.