Pawan Kalyan - హెల్త్ అప్ డేట్

Tuesday,April 27,2021 - 04:38 by Z_CLU

గుడ్ న్యూస్.. కరోనా నుంచి పవన్ కల్యాణ్ పూర్తిగా కోలుకున్నారు. కాకపోతే ఇంకా హోం క్వారంటైన్ లోనే ఉన్నారు. తాజాగా జరిపిన టెస్టుల్లో పవన్ కు నెగెటివ్ వచ్చినప్పటికీ ఆయన ఇంకా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. దీనికి కారణం వీక్ నెస్.

కరోనా తర్వాత కొంతమంది చాలా వీక్ అయిపోతున్నారనే విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కూడా అదే వీక్ నెస్ తో బాధపడుతున్నారట. దీనికితోడు లంగ్స్ కు సంబంధించిన మెడికేషన్ కోర్స్ ఇంకా పూర్తికాలేదు. అందుకే మరికొన్నాళ్లు తన ఫామ్ హౌజ్ లోనే ఉండబోతున్నారు పవన్. అప్పుడే బయటకు రారు.

pawan kalyan corona zeecinemalu 1

పవన్ తాజా నిర్ణయంతో ఆయన నటిస్తున్న సినిమాలు ఇంకాస్త లేట్ గా సెట్స్ పైకి రాబోతున్నాయి. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు.. హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు పవన్. ఈ రెండు సినిమాల్ని జూన్ నుంచి స్టార్ట్ చేయాలని పవన్ అనుకుంటున్నారట. అంటే మే నెల మొత్తం పవన్ రెస్ట్ తీసుకుంటారన్నమాట. అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో నిత్యం బిజీగా ఉండే పవన్ లాంటి వాళ్లకు ఈమాత్రం రెస్ట్ తప్పనిసరి.

తనకు కరోనా సోకినట్టు ఈనెల 16న ప్రకటించారు పవన్ కల్యాణ్. అప్పట్నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అపోలో వైద్యులతో పాటు, ఖమ్మంకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు పవన్ ను దగ్గరుండి పర్యవేక్షించారు. CT స్కాన్ లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించి, ఆ దిశగా ట్రీట్ మెంట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరోసారి టెస్టులు చేయగా, అందులో నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు పవన్ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics