Acharya పవన్ కళ్యాణ్ సిద్ద పాత్ర చేసి ఉంటే ?

Tuesday,April 26,2022 - 03:46 by Z_CLU

Pawan Kalyan Is The Best Alternative For Ram Charan’s Siddha role Said Chirajeevi

మెగా స్టార్ చిరంజీవి -కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆచార్య’ లో రామ్ చరణ్ సిద్ద అనే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. సుమారు నలబై నిమిషాల నిడివితో ఉండే సిద్ద పాత్ర కథలో చాలా కీలకం అంటూ కొరటాల పలు మార్లు చెప్పుకున్నారు. అయితే ఈ పాత్ర చరణ్ చేయలేకపోతే మరో స్టార్ హీరోతో చేయించాలని భావించారు. కానీ ఎట్టకేలకు చరణ్ కే ఈ పాత్ర రాసిపెట్టుంది. అందుకే తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని ఆచార్య ఓ భాగమయ్యాడు మెగా పవర్ స్టార్.

అయితే “ఒకవేళ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే? – అనే ప్రశ్న తాజాగా ‘ఆచార్య’ ప్రెస్ మీట్ లో చిరంజీవికి ఎదురైంది.

ఈ ప్రశ్నకి బదులుగా చిరంజీవి మాట్లాడుతూ “రామ్ చరణ్ చేసిన సిద్ధ పాత్రకు హీరోలందరూ  న్యాయం చేస్తారు. అందులో మరో సందేహం లేదు. కానీ, రామ్ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు. నిజ జీవితంలో తండ్రీ కొడుకుల అనుబంధం వెండి తెరపై ఆ కేరెక్టర్స్ కి  యాడెడ్ వేల్యూ అవుతుంది. ఒకవేళ చరణ్ కు ఈ పాత్ర చేయడం కుదరలేకపోతే మాత్రం బెస్ట్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్” అని చెప్పారు.

 “ఒకవేళ సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే నిజ జీవితంలో మా అనుబంధం కూడా యాడెడ్ వేల్యూ అయ్యేది. చరణ్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో… పవన్ తో చేసినప్పుడు కూడా నాకు అదే ఫీల్ ఉంటుంది. వంద శాతం అదే ఫీలింగ్ వస్తుంది. అందులో నో డౌట్. అయితే, అంత వరకూ రాలేదనుకోండి. ఈ సినిమాకు అన్నీ కుదిరి చరణే చేశాడు ” అని చెప్పారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics