Pawan Kalyan - షూటింగ్స్ కు రెడీ

Tuesday,June 22,2021 - 12:01 by Z_CLU

కెరీర్ లో ఎన్నడూలేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు స్టార్ట్ చేశారు పవన్ కల్యాణ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికే మరో సినిమా రెడీ అయి ఉండేది. కానీ కరోనా వల్ల పవన్ ప్లానింగ్ మొత్తం తారుమారైంది. మధ్యలో పవన్ కూడా కరోనా బారిన పడ్డంతో ఇంకాస్త లేట్ అయింది. అలా ఆగిపోయిన సినిమాల్ని ఇప్పుడు మరోసారి సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు పవర్ స్టార్. వచ్చే నెల రెండో వారం నుంచి సినిమాలకు కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేశారు.

పవన్ వెంటనే స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవన్ జులై రెండో వారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. దీని కోసం ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ సెట్ వేస్తున్నారు. అది రెడీ అయిన వెంటనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈసారి పవన్-రానా కాంబినేషన్ లో సీన్లు తీయబోతున్నారు.

ఇంకా పేరుపెట్టని ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు పవన్. మరోవైపు రానాతో తీయాల్సిన సోలో సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ నెలాఖరుకు ఈ సినిమా టోటల్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయి.

ఇక అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు సైమల్టేనియస్ గా.. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు పవన్. ఈ సినిమా కోసం ఇప్పటికే గోల్కొండ సెట్ వేశారు. ఆ సెట్ లోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈసారి సెట్స్ పైకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు.

Vakeel-saab-pawan-kalyan-stills

పవన్ కల్యాణ్

ధర్డ్ వేవ్ ప్రభావం లేకపోతే ఈ ఏడాది చివరి నాటికి అయ్యప్పనుమ్ కోషియమ్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. ఆ వెంటనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ఇక హరిహర వీరమల్లు సినిమాను సంక్రాంతికి తీసుకొస్తామంటూ ప్రకటించినప్పటికీ, అది సాధ్యం కాకపోవచ్చు. షూటింగ్ తర్వాత గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంది. అయితే ఎట్నుంచి ఎటు చూసుకున్నా ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అవ్వడం గ్యారెంటీ.

అటు హరీష్ శంకర్, స్క్రిప్ట్ మొత్తం పూర్తిచేసి పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సెప్టెంబర్ నుంచి పవన్ కాల్షీట్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics