వినాయక్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్

Tuesday,March 28,2017 - 02:08 by Z_CLU

కాటమరాయుడు సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాకి గుమ్మడి కాయ కూడా కొట్టకముందే మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని సెట్స్ పైకి వెళ్ళడానికి ఎనీ టైం రెడీ మోడ్ లో ఉన్నాడు త్రివిక్రమ్. కాటమ రాయుడు సినిమా తరవాత పవర్ స్టార్ క్యాటగిరీ లో హాట్టెస్ట్ టాపిక్ ఏదైనా ఉంటే అది ఈ సినిమానే. అయితే ఇప్పుడు ఇదే ప్లేస్ లో మరో టాక్ డామినేట్ చేస్తుంది, ఈ టాక్ ఎంతవరకు జెన్యూన్ అన్నది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్స్ లిస్టులో మరో మాసివ్ డైరెక్టర్ పేరు హైలెట్ అవుతుంది.

మ్యాగ్జిమం ఏప్రియల్ లో పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ పైకి వచ్చే చాన్సెస్ ఉన్నాయి. అయితే మరో వైపు పవన్ కళ్యాణ్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో సినిమా ఆల్ మోస్ట్ ఫిక్సయిందనే టాక్ టాలీవుడ్ లో హై ఎండ్ హీట్ ని జెనెరేట్ చేస్తుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఈ కాంబినేషన్ ని ఆల్ రెడీ ఎక్స్ పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ లో కొత్త జోష్ క్రియేట్ అయింది.

మెగాస్టార్ ఖైదీ నం 150 తరవాత తన నెక్స్ట్ వెంచర్ విషయంలో హై ఎండ్ సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న వి.వి. వినాయక్ నెక్స్ట్ సినిమా అకౌంట్ లో నిన్న మొన్నటి వరకు చాలామంది స్టార్స్ పేర్లు వినిపించాయి. సాయి ధరం తేజ్, రవితేజ, వరుణ్ తేజ్ లతో వినాయక్ ఆల్ మోస్ట్ రెడీ ఫర్ యాక్షన్ మోడ్ లో ఉన్నాడని చాలా రూమర్సే వినిపించాయి. కానీ అవన్నీ నిజం కాదని వినాయక్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. అంతలో ఈ కాంబో టాపిక్ అయి కూర్చుంది. మరి ఇది కూడా జస్ట్ రూమర్ గా మిగిలిపోనుందా..? లేకపోతే టాలీవుడ్ లో ఈ రేంజ్  వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ టాపిక్ రియాలిటీ లోకి ట్రాన్స్ ఫాం అవుతుందా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో పదిహేనేళ్ళు కంప్లీట్ చేసుకున్న వి.వి. వినాయక్ ఇప్పటి వరకు పవర్ స్టార్ తో సినిమా చేయలేదు. మరి ఆ బారియర్ ని ఈ ఇయర్ బ్రేక్ చేయనున్నాడా..? చూడాలి.