Pawan Kalyan - రవితేజ దర్శకుడితో పవర్ స్టార్?

Wednesday,May 19,2021 - 04:10 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ సెట్స్ పై ఉండగానే నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు పవన్. అందులో రెండు సినిమాలను సెట్స్ పై పెట్టేశాడు కూడా. క్రిష్ తో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ తో పాటు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానాతో కలిసి నటిస్తున్న సినిమాను కూడా కొంత వరకు పూర్తి చేశాడు. ఇక నెక్స్ట్ లిస్టులో హరీష్ శంకర్ తో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా ఉంది. ముందుగా హరీష్ శంకర్ సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు పవన్.

ramesh varma

దర్శకుడు రమేష్ వర్మ

అయితే పవన్ నెక్స్ట్ లిస్టులో తాజాగా మరో దర్శకుడి పేరు చక్కర్లు కొడుతుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు రమేష్ వర్మ. ఈ మధ్య ‘రాక్షసుడు’ రీమేక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు రమేష్ వర్మ. రవితేజతో ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమా తీస్తున్నాడు. ‘ఖిలాడి’ తర్వాత ఈ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తాడని ఈ కాంబో సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తాడని ప్రచారం జరుగుతుంది.

pawan kalyan bandla ganesh

పవన్ తో బండ్ల గణేశ్

అయితే ఈ కాంబో సినిమాపై తాజాగా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు నిర్మాత బండ్ల గణేష్. “తప్పు వార్త.. ఏదైనా ఫైనలైజ్ అయితే నేనే ఎనౌన్స్ చేస్తా” అంటూ ఈ రూమర్ ని కొట్టి పారేశాడు గణేష్. దీంతో పవన్ నెక్స్ట్ లిస్టులో ఈ దర్శకుడు లేడన్న సంగతి ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చింది. పవన్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా ఉంటుంది. కానీ అదెప్పుడు సెట్స్ పైకి వెళుతుంది ? దర్శకుడు ఎవరు అనేవి ఫైనల్ అవ్వలేదు. ఒక్కసారి డైరెక్టర్ ఫైనల్ అవ్వగానే బండ్ల గణేష్ మహానందంగా ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేస్తాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics