హాట్ టాపిక్: చిరు-పవన్ మల్టీస్టారర్ ఇదేనా?

Monday,April 06,2020 - 03:31 by Z_CLU

చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ నిర్మిస్తానని అప్పుడెప్పుడో సుబ్బరామిరెడ్డి ఘనంగా ప్రకటించారు. దానికి మెగా మల్టీస్టారర్ అనే బిరుదు కూడా తగిలించారు. కానీ అది దాదాపు రాకపోవచ్చని అంతా ఫిక్స్ అయిపోయారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరోసారి మెగాస్టార్-పవర్ స్టార్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ఈసారి అది సుబ్బరామిరెడ్డి సినిమా కాదు. ఆచార్య మూవీతో చిరంజీవి-పవన్ కలుస్తారనేది లేటెస్ట్ హాట్ టాపిక్.

నిజానికి ఆచార్య సినిమాలో కీలకపాత్ర కోసం మహేష్ బాబును అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల చరణ్ తోనే ఆ పాత్ర చేయిస్తామని చిరంజీవి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. కరోనా కారణంగా RRR షూట్ బాగా లేట్ అవుతోంది. ఇలాంటి టైమ్ లో ఆచార్యలో నటించడానికి చరణ్ కు రాజమౌళి పర్మిషన్ ఇస్తాడా అనేది డౌట్. ఎందుకంటే ఇది చిన్న పాత్ర కాదు. దాదాపు 30 నిమిషాల రన్ టైమ్ ఉన్న క్యారెక్టర్. ఎంత కాదనుకున్నా 3 వారాల కాల్షీట్లు అవసరం.

RRRను పక్కనపెట్టి ఆచార్య కోసం 3 వారాల పాటు చరణ్ ను రాజమౌళి వదిలేస్తాడని చెప్పలేం. అదే కనుక జరిగితే అప్పుడు పవన్ ను రంగంలోకి దించాలని చిరంజీవి అనుకుంటున్నారట. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కోరుకుంటోంది కూడా ఇదే. చిరు-పవన్ కలిసి నటిస్తే చూడాలని ప్రతి ఒక్కరికి ఉంది. ఆచార్యతో ఈ కాంబో వర్కవుట్ అయితే చూడాలనుకుంటున్నారు.