త్రివిక్రమ్ చేతికి పవన్ రీమేక్?

Thursday,September 17,2020 - 06:45 by Z_CLU

ఏదైనా భాషలో సినిమా బ్లాక్ బస్టర్ అయితే మిగతా భాషల్లో కూడా దానికి ఆటోమేటిగ్గా క్రేజ్ పెరుగుతుంది. రీమేక్ రైట్స్ కు డిమాండ్ వస్తుంది. ఇప్పుడు అలాంటి బ్లాక్ బస్టర్ సినిమానే తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు.

మలయాళంలో భారీ వసూళ్లు తెచ్చిపెట్టిన ‘అయ్యప్పనుమ్ కోశియం’ను తెలుగులో సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించబోతున్నాడు.

ఈ రీమేక్ ను రవితేజ, రానా కాంబినేషన్ లో తెరకెక్కించాలనుకున్నారు. సుధీర్ వర్మ, సాగర్ చంద్ర లాంటి పేర్లు కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్టు అటుఇటు తిరిగి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వద్దకు చేరిందని టాక్.

అవును.. Ayyappanum Koshiyum Telugu Remake Pawan Kalyan చేతికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ రీమేక్ ప్రాజెక్టుకు ఏ డైరక్టర్ అయితే బాగుంటుందో సెలక్ట్ చేయాల్సిన బాధ్యతకు పవన్, త్రివిక్రమ్ కు అప్పగించాడట.