Pawan Harish Movie - భవదీయుడు భగత్ సింగ్

Thursday,September 09,2021 - 05:56 by Z_CLU

‘’భవదీయుడు భగత్ సింగ్” 

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. సూపర్ హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ వచ్చే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, పాపులర్ డైరక్టర్ హరీష్ శంకర్ ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం పేరును ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ మాత్రమే కాదు, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు

Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh

‘’భవదీయుడు భగత్ సింగ్” ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే ….’ బైక్ పై పవన్ కళ్యాణ్ జీన్స్, జర్కిన్ వేసుకొని ఓ చేతిలో టీ గ్లాస్, మరో చేతిలో స్పీకర్ తో స్టైలిష్ గా కూర్చొని ఉండటం కనిపిస్తుంది.

‘భవదీయుడు’ అన్న పదం వినయం, విధేయత గా అనిపిస్తే…
‘భగత్ సింగ్’ విప్లవ చైతన్యానికి మారుపేరు గా స్ఫురిస్తుంది.
ఈ రెండింటినీ కలిపి ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అని పెట్టడంలో దర్శకుడు ఆంతర్యమేమిటి…?
ఈ చిత్రం ఓ లేఖ అయితే.. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనేది ఓ సంతకం అయితే…..
ఈ లేఖలో ఏం రాశారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పబోతున్నారు, అన్నీ ఆసక్తిని, ఆలోచనలు రేకెత్తించేవే.

ఖచ్చితంగా ‘భవదీయుడు భగత్ సింగ్’ వెండితెరపై ఓ చెరగని సంతకం అనిపిస్తుంది.

 “దిస్ టైం ఇట్స్ నాట్ జస్ట్ ఎoటర్ టైన్ మెంట్” అనే క్యాప్షన్ ను నిజం చేసేలా ‘’భవదీయుడు భగత్ సింగ్” ఉండబోతోంది.

ఈ చిత్రానికి అయనాంక బోస్ సినిమాటోగ్రాఫర్. ఆనంద సాయి ఆర్ట్ డైరక్టర్ గా, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ పనిచేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics