Pawan Kalyan Harish Shankar Movie - సెట్స్ పైకి వస్తోంది

Monday,June 07,2021 - 05:30 by Z_CLU

వకీల్ సాబ్ తో మొదలు పెట్టి మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు సెట్స్ పై పెట్టి షెడ్యుల్స్ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ తో చేస్తున్న ‘హరి హర వీర మల్లు’ , సాగర్ చంద్ర డైరెక్షన్ రానాతో చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ త్వరలోనే మరో సినిమాను కూడా మొదలు పెట్టే ఆలోచలనలో ఉన్నాడట. పవన్ లైనప్ లో హరీష్ శంకర్ సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నటీ నటుల ఎంపిక కూడా మొదలు పెట్టారు. కొన్ని పాత్రలకు నటుల ఎంపిక పూర్తయింది.

pawan kalyan zeecinemalu

పవన్ కల్యాణ్

ఈ సినిమాను ఆగస్ట్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడట పవన్. ఇప్పటికే మొదటి షెడ్యుల్ కి సంబంధించి బల్క్ డేట్స్ కూడా అడ్జస్ట్ చేశాడని సమాచారం. ఆగస్ట్ నుండి మొదలు పెట్టి నెలన్నర పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట పవన్. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సినిమాకు సంబంధించి భారీ సెట్ రెడీ చేసే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. మొదటి షెడ్యుల్ కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ రెడీ చేస్తున్నారట. ఆ సెట్ లోనే కీలక సన్నివేశాలు ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారట.

ఇప్పటికే సినిమాలో పవన్ ఎలా ఉంటాడు ? కథ ఎలా ఉండనుంది ? లాంటి విషయాలు పసిగట్టేలా ఓ ప్రీ లుక్ పోస్టర్ తో హింట్ ఇచ్చిన హరీష్ సినిమాలో పవన్ ని సరికొత్తగా చూపిస్తాడని అర్థమవుతుంది. సినిమాలో కొన్ని పొలిటికల్ టచ్ తో కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేసాడని ,అలాగే హరీష్ స్టైల్ లో కొన్ని పంచ్ లు కూడా పవన్ నోటి నుండి రానున్నాయని తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి వసూళ్ళు రాబట్టింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఈ కాంబోలో రాబోయే సినిమా దానికి మించి కలెక్ట్ చేయడం ఖాయం అనిపిస్తుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics